బదిలీపై వెళ్లిన ప్రిన్సిపాల్‌కు ఘన సన్మానం
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం బదిలీపై వెళ్లిన ప్రిన్సిపాల్ ఎం. సంజీవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అనేది సర్వసాధారణం అన్నారు. ఉద్యోగులు చేసిన సేవలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని పేర్కొన్నారు.