మెట్ పల్లి మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం జరిగింది. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో సమావేశానికి ఛైర్మన్ రానవేణి సుజాత అధ్యక్షత నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ప్రవేశపెట్టిన మొత్తం 13 అంశాల్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ చెట్లపల్లి మీనా మాట్లాడుతూ పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలన్నారు.