బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 18న ఉదయం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 నుండి 20 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు వస్తారు.