గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గోదావరి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపికి చెందిన వెంకటేష్ (27) మేస్త్రి పనిచేస్తూ మొగిలిపేట గ్రామంలో నివసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గోదావరి నదికి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.