జగిత్యాల: అన్నను తల్వార్తో నరికి చంపిన తమ్ముడు
జగిత్యాల: ఆస్తి కోసం సొంత అన్ననే తమ్ముడు దారుణంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన మల్లాపూర్ మండలం ఒబులాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లెపు సాయిలు, పల్లెపు చందు ఇద్దరు అన్నదమ్ములు. కాగా, ఆస్తి విషయంలో ఇద్దరు సోదరుల మధ్య గొడవ తలెత్తడంతో కోపోద్రిక్తుడైన చందు గ్రామ శివారులో సాయిలును తల్వార్తో నరికి చంపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.