ఊటూర్ సొసైటీ చైర్మన్ పై అనర్హత వేటు

81చూసినవారు
ఊటూర్ సొసైటీ చైర్మన్ పై అనర్హత వేటు
మానకొండూర్ మండలం ఊటూర్(లక్ష్మిపూర్) సహకార సంఘంలో నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డిపై సహకార శాఖ అధికారులు అనర్హత వేటు వేశారు. కొద్ది నెలల క్రితం సొసైటీ నిధులను చైర్మన్, సీఈఓ ఇద్దరు కలిసి పక్కదారి పట్టించారని అధికారుల విచారణలో తేలింది. సీఈఓ రవీందర్ ను ఇటీవలే తొలగించారు. చైర్మన్ పై అనర్హత వేటు వేస్తూ జిల్లా సహకార అధికారి ఎస్. రామనుజాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్