సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి

61చూసినవారు
సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి
సెప్టెంబర్ 30లోగా ఖరీఫ్ 2023- 24 సీజన్ కు సంబంధించి పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీని తప్పనిసరిగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పాల్గొన్నారు.