పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరి కలిసి మంథనిలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని బాలికను నమ్మించింది. అయితే సదరు బాలిక ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.