పాఠ్య ప్రణాళిక అంశాల్లో రాణించాలి..

77చూసినవారు
పాఠ్య ప్రణాళిక అంశాల్లో రాణించాలి..
విద్యార్థులు తమ రెగ్యులర్ పాఠ్యాంశాలకు తోడుగా సహ పాఠ్య ప్రణాళిక అంశాల్లో కూడా పాల్గొని రాణించాలని జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త డాక్టర్ పీఎం షేక్ అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులకు ఉపయుక్తంగా పలు సృజనాత్మక సైన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా సైన్స్ అధికారి బి. రవినందన్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్