పెద్దపల్లి జిల్లాలో బతుకమ్మ సంబరాలు
పెద్దపల్లి జిల్లాలోని మండలాలు మరియు గ్రామాల్లో ఎంగిలి పూల బ్రతుకమ్మ పండగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు కొత్త బట్టలు బంగారు నగలు ధరించి వాడలల్ల బతుకమ్మల కోసం ఏర్పాటు చేసుకున్న స్థలంలో కోలాటాల ఆటలు డీజే పాటలతో అంబరాన్ని అంటేలా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మాల చుట్టూ తిరుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఎంగిలి పూల బతుకమ్మను ఆడుకున్నారు.