బాయమ్మపల్లిలో నవరాత్రి ఉత్సవాల్లో కుంకుమ పూజ
ఓదెల మండలంలోని బాయమ్మపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణపతి పూజ, లక్ష్మి పూజ, కుంకుమ పూజ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కుంకుమ పూజకు గ్రామంలోని మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.