విద్యార్థులకు నాణ్యతమైన విద్యనందించడం చాలా ముఖ్యమైనదని మరియు ఖ్యాతి గడించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక యూనీవర్సల్ ఐకాన్ అచీవర్ ఆవార్డ్ 2024 రావడం పట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా అల్ఫోర్స్ తెలంగాణ విద్యరంగంలో అనేక పెనుమార్పులు తీసుకరావడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభవంతులుగా చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని విద్యనందిస్తూ అగ్రగామిగా నిలుస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. చక్కటి ప్రణాళికలతో విద్యనందిస్తున్నందుకు యూ.ఏ.ఇ. చెందిన జెనటిక్స్ అల్టిమా వారు అల్ఫోర్స్ అవలంబిస్తున్న విద్య విధానాలకు వారు యూనివర్సల్ ఐకాన్ అచీవర్ ఆవార్డ్ 2024 ని ప్రకటించి ప్రతినిధి ద్వారా పంపించారని చెప్పారు. ఈ ఆవార్డు రావడానికి కృషి చేసిన పరిపాలన విభాగం వారికి,విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.