కట్టుదిట్టంగా బాలల సంరక్షణ కార్యక్రమాలు అమలు: కలెక్టర్
జిల్లాలో బాలల సంరక్షణ కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య కార్యక్రమ అమలుపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంబంధిత మహిళ శిశు దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, మిషన్ వాత్సల్య సిబ్బంది పాల్గొన్నారు.