Feb 10, 2025, 13:02 IST/
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
Feb 10, 2025, 13:02 IST
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు సోమవారం 'రైతు భరోసా' నిధులను విడుదల చేసింది. ఇందుకు రూ. 2223.46 కోట్లు నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు 34 లక్షల 75వేల 994 మందికి రైతుల ఖాతాలో నిధుల జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.