20వ డివిజన్ లో దోమల నివారణకు చర్యలు

551చూసినవారు
20వ డివిజన్ లో దోమల నివారణకు చర్యలు
కరోనా వైరస్ పై యుద్దంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ 20 వ డివిజన్ పరిధిలోని రైల్వేస్టేషన్ ఏరియా, రైల్వే కాలనీ, శివాజీ నగర్, భరత్ నగర్, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ నగర్, జీరో పాయింట్, మల్యాల పల్లిలో క్రిములు, దోమలను నివారించడానికి ఫాగింగ్ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, భౌతిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :