పెద్దపల్లి: వాకర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ
గోదావరిఖని సింగరేణి స్టేడియంలో మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని పలు సమస్యలను వాకర్స్ ఎంపి దృష్టికి తీసుకకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. స్టేడియంలో వాకింగ్ ట్రాక్ తోపాటు సీనియర్ సిటిజన్స్ కూర్చునేందుకు బెంచిలు కావాలని, టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించగా, తనవంతు కృషి చేస్తానని చెప్పారు.