ఈశాల తక్కల్లపల్లిలో పడకేసిన పారిశుద్ధ్యం

79చూసినవారు
ఈశాల తక్కల్లపల్లిలో పడకేసిన పారిశుద్ధ్యం
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ పనులు పడకేశాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. జనావాసాల్లో ఎక్కడ చూసినా మురుగు నీరు దోమలు, ఈగలతో జనం బిక్కుబిక్కుమంటూ సహవాసం చేస్తున్నారని, డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నాయని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లి వీధులను శానిటేషన్ చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా బురద నీళ్ళు దర్శనమిస్తున్నాయి అన్నారు.

సంబంధిత పోస్ట్