Sep 19, 2024, 02:09 IST/
VIDEO: ఆటోడ్రైవర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే
Sep 19, 2024, 02:09 IST
AP: ఎమ్మెల్యే పులివర్తి నాని ఆటోడ్రైవర్ అవతారం ఎత్తారు. టీడీపీ కార్యకర్త ప్రకాష్ బతుకుతెరువు కోసం ఆటోను కొనుక్కున్నాడు. ఆ ఆటో ఎమ్మెల్యే పులివర్తి నానికి చూపించాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా వస్తున్నట్లు తెలుసుకుని.. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ఆటో చూపించాడు. కార్యకర్త కళ్లల్లో ఆనందం కోసం కారు వదిలిన ఎమ్మెల్యే ఆటో నడిపి రూ.500 బోణి చేశారు.