శ్రీరాంపూర్: రవీందర్ గౌడ్ కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీరాంపూర్ మండలం గంగారంకి చెందిన శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి కోక్కిస రవీందర్ గౌడ్ గత గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ ఎంపీటీసీ కదులు మానస, సతీష్, నిదానపురపు, దేవయ్య, జక్కి రవి, చక్రపాణి, ఉడ్నాల శ్రీనివాస్ బుజ్జ వెంకన్న ఉన్నారు.