జ్వరంతో బాలుడు మృతి

59చూసినవారు
జ్వరంతో బాలుడు మృతి
విష జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫరాఖాన్పేటలో జరిగింది. గ్రామానికి చెందిన మల్లేశ్-పద్మ దంపతుల కుమారుడు సాత్విక్(13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాలుడు కొద్ది రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్