పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు అథ్లెటిక్స్, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, సాఫ్ట్ బల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. గురువారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, సంజీవరావు పాల్గొన్నారు.