బాక్సింగ్ డే టెస్టు సమయంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాన్‌స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లీకి ఐసీసీ జరిమానా విధించినట్లు సమాచారం. తొలుత మ్యాచ్ నిషేధం విధిస్తారని క్రికెట్ వర్గాలు భావించినప్పటికీ జరిమానాతో సరిపెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.