రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కీర్తి రాజు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ గురువారం తన వంతు సహాయంగా కీర్తి రాజుకు రూ. 10, 000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రేగుల బిక్షపతి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎలవేణి రమేశ్, తదితరులు ఉన్నారు.