సీఎం రేవంత్‌కు కవిత బహిరంగ లేఖ

74చూసినవారు
సీఎం రేవంత్‌కు కవిత బహిరంగ లేఖ
ఇంకెంతకాలం స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల పెంపు జాప్యం చేస్తారని సీఎం రేవంత్‌కు BRS MLC కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే BCలకు రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి BC డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొని.. ఇప్పుడు ఏడాది గడిచినా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదన్నారు. ఈ మేరకు గురువారం CM రేవంత్‌కు కవిత బహిరంగ లేఖ రాశారు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాప చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోందన్నారు.