శేషగిరిరావు మృతిపట్ల సంతాపం తెలిపిన కేసీఆర్‌

79చూసినవారు
శేషగిరిరావు మృతిపట్ల సంతాపం తెలిపిన కేసీఆర్‌
BRS పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, DCMS మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల పార్టీ చీఫ్ కేసీఆర్ సంతాపం తెలిపారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, ప్రజలకోసం, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న శేషగిరి రావు.. ఇవాళ HYDలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్