ప్రస్తుత రాజకీయాలు ఏ మాత్రం బాగాలేవన్నది వాస్తవమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.‘X’లో కేటీఆర్ చిట్‌చాట్ లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. 'కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు, రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం సమయం ఇస్తున్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇస్తున్నారు' అని అన్నారు.