Sep 15, 2024, 03:09 IST/పాలేరు
పాలేరు
వరద బాధితులను ఆదుకుంటాం: మంత్రి
Sep 15, 2024, 03:09 IST
కేంద్రం నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నేలకొండపల్లి మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల పరిహారాన్ని త్వరలో జమ చేయనుండగా, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.