కూతురు నిశ్చితార్థం జరుగుతుండగా తండ్రి మృతి
ఖమ్మం పట్టణంలో పెను విషాదం నెలకొంది. కూతురు నిశ్చితార్థం జరుగుతుండగా తండ్రి మరణించడం తీవ్రంగా కలిచివేసింది. పట్టణానికి చెందిన సాదిక్ ఆలీ తన కూతురు నిశ్చితార్థ వేడుక షాది ఖానాలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ వేడుక జరుగుతుండగా సాదిక్ ఆలీ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. దీంతో ఆయన ముగ్గురు కూతుళ్లు, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.