గెలవక ముందు జనసేనాని, గెలిచాక 'భజన' సేనాని: ప్రకాష్ రాజ్

68చూసినవారు
గెలవక ముందు జనసేనాని, గెలిచాక 'భజన' సేనాని: ప్రకాష్ రాజ్
పిఠాపురంలో శుక్ర‌వారం రాత్రి జ‌న‌సేన జ‌య‌కేత‌నం స‌భ‌లో ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి కౌంట‌ర్ ఇచ్చారు. ఈ మేరకు 'ఎక్స్' వేదిక‌గా ఆయన ట్వీట్ చేశారు. "గెలవక ముందు 'జనసేనాని', గెలిచిన తరువాత 'భజన సేనాని'... అంతేనా?" అని ప్రకాష్ రాజ్ ప్ర‌శ్నించారు. హిందీ వ‌ద్దంటూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ గ‌తంలో చేసిన పోస్టుల్ని ఆయ‌న ఈ ట్వీట్‌కి జ‌త చేశారు.

సంబంధిత పోస్ట్