తల్లీకూతుళ్లపై దాడి చేసిన ఆవు (వీడియో)

52చూసినవారు
తమిళనాడు రాజధాని చెన్నైలోని బాలాజీ నగర్‌లో రోడ్డుపై వెళుతున్న తల్లీకూతుళ్లపై ఓ ఆవు దాడి చేసింది. మొదట చిన్నారిపై ఆవు దాడి చేసేందుకు ప్రయత్నించగా తల్లి ముందుకొచ్చి అడ్డుగా నిలిచింది. దీంతో ఆవు ఆ మహిళను కొమ్ములతో పొడిచి కింద పడేసింది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఆవు వెనక్కి తగ్గలేదు. కాసేపటి తర్వాత ఆవు వదిలేయడంతో గాయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్