ఇస్లామిక్‌ స్టేట్ అధినేత అబు ఖదీజా ఖతం (వీడియో)

82చూసినవారు
ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ ఐసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్‌ అల్‌ రిఫాయ్‌ అలియాస్‌ అబు ఖదీజాను అమెరికా మట్టుబెట్టింది. ఇరాకీ ఇంటెలిజెన్స్‌, భద్రతా దళాల సహకారంతో ఇరాక్‌లో జరిపిన ఆపరేషన్‌లో అతడిని హతమార్చింది. ఈ నెల 13న అబు ఖదీజా, మరొక ఉగ్రవాది వాహనంపై వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్‌ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్