జిల్లా గ్రంథాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం 74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ -ఉల్ -హక్ (ఖమర్ ) గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఖమర్ మాట్లాడుతూ...ఎందరో యోధుల త్యాగమే ఈ స్వాతంత్య్రం దేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తి చెయ్యడానికి ప్రాణాలను సైతం లెక్కచేయని వీరులందరినీ మనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అని తెలిపారు. ఆ త్యాగధనులు, స్ఫూర్తి ప్రధాతలను గౌరవించుకుంటూ, దేశ నవనిర్మాణంలో భాగస్వాములు అవ్వడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెల్పుల అర్జున్, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు కె.వి.యస్.యల్.న్ రాజు, ఎండి ఇమాం, భాస్కర్, నాగన్న, అఖిల్, విజయకుమారి మరియు గ్రంథాలయ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు.