కామేపల్లి ఇందిరా గాంధీ సెంటర్ లో సద్దుల బతుకమ్మ సంబరాలను గురువారం రాత్రి నిర్వహించారు. తీరోక్క పువ్వుల తో అందంగా అలంకరించిన బతుకమ్మ లను పేర్చుకొని ప్రధాన కూడలిలో ఏర్పా టు చేసి బతుకమ్మ పాటలు పాడి అనం తరం సాంప్రదాయ నృత్యాలతో పాటలు పాడుతూ వెళ్లి రా బతుకమ్మ మళ్లీ రా అంటూ సాగనంపారు. అనంతరం స్థానిక ప్రధాన పెదవాగులో నిమజ్జనం చేశారు. మహిళలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.