Mar 31, 2025, 10:03 IST/
రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు లేదు: జగదీశ్ రెడ్డి
Mar 31, 2025, 10:03 IST
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని, సీఎం అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుందని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ ప్రస్థావన లేకుండా మాట్లాడడం లేదని, కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.