యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భింగా కొత్వాలి ప్రాంతంలోని భింగా పట్టణంలోని ఖల్వా బజార్‌లో ఓ యువకుడు మైనర్ బాలుడిపై దాడి చేశాడు. ఆ బాలుడిని రోడ్డు మధ్యలో యువకుడు తన్ని, పిడిగుద్దులతో దారుణంగా కొట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మైనర్ బాలుడిపై యువకుడు దాడి చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.