అరుణాచల్ ప్రదేశ్‌లో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2.38గంటలకు షియోమీలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ లలో భూకంపం సంభవించగా, భారత్‌లోని మేఘాలయ, కోల్‌కతా, ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.