యాపిల్‌కు సుమారు రూ.1,388 కోట్ల భారీ జరిమానా

62చూసినవారు
యాపిల్‌కు సుమారు రూ.1,388 కోట్ల భారీ జరిమానా
టెక్‌ దిగ్గజం యాపిల్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం 150 మిలియన్ యూరోలు (సుమారు రూ.1388 కోట్లు) జరిమానా విధించింది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌లకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ల మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని యాపిల్‌పై చర్యలు తీసుకుంది. అనుచిత వ్యాపార విధానాలు పాటించినందుకు ఫ్రాన్స్‌ పోటీ నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో 7 రోజులు ప్రచురించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్