మధిర మండలంలోని సాయిబాబా గుడి సమీపంలో ఉంటున్న దారా రంగారావు పెన్షన్ నగదును తీసుకునేందుకు ఎస్బీఐ ఎటీఎం కేంద్రంలోకి వెళ్లాడు. ఎటీఎం వద్ద పక్కనే ఉన్న మరో వ్యక్తి నేను డ్రా చేసి ఇస్తానని చెప్పి పిన్ నెంబర్ ను తెలుసుకుని తప్పుగా కొట్టడంతో డబ్బులు రాలేదు. దీంతో రామారావు తన కార్డును తీసుకొని వెళ్లిపోయాడు. వెంటనే ఆ వ్యక్తి తన కార్డుని పెట్టి రంగారావు పిన్ నెంబర్ కొట్టి రూ. 20వేలు తీసుకుని పరారయ్యాడు.