గుండెపోటుతో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలం నాగులవంచలో గురువారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముదిగొండ మండలం మేడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. శ్రీనివాసరావు మృతికి పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.