ఇటీవల వచ్చిన వరదలకు నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం చెరువు అలుగు వద్ద ఉన్న రాళ్లవాగు బంధం పూర్తిగా కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కట్ట నిర్మాణానికి అధికారుల అంచనా వేసి 50 మీటర్ల పోయాల్సి ఉందని నివేదిక అందించడంతో రూ. 15 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆన్లైన్ టెండర్లు కూడా పూర్తయినట్లు శనివారం తెలిసింది.