పినపాక మద్దులగూడెం గ్రామంలో ప్రసాద్-మరియమ్మ దంపతుల మూడో సంతానమైన రెండు నెలల చిన్నారి రెండు రోజులుగా జలుబుతో బాధ పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన మహేశ్-మంజు దంపతుల మొదటి సంతానం రెండు నెలల వయసున్న ఈ బాలుడు వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.