పినపాక: ప్రాణం తీసిన డిజే సౌండ్
పినపాక మండలం పట్టి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. కొట్టే వెంకయ్య (85) అనే వృద్ధుడు తన మనవడి పెళ్లిలో డాన్స్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన బంధువులందరూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోగా అక్కడ వైద్యులు పరీక్షించి మరణించాడని తెలిపారు. అత్యధిక డిజె సౌండ్ వల్ల గుండెపోటు వచ్చి మరణించాడని బంధువులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీజేలకు అనుమతి ఇవ్వకూడదని శుక్రవారం స్థానికులు కోరారు.