టెక్నాలజీకి నోచుకోని ఏజెన్సీ ప్రాంతం

654చూసినవారు
టెక్నాలజీకి నోచుకోని ఏజెన్సీ ప్రాంతం
సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా నడిచే చౌక ధరల దుకాణం ద్వారా.. పంపిణీ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ మాన్యువల్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. భవన పాలెం గ్రామ ప్రజలు పెనుబల్లి ఎమ్మార్వో కి విన్నవించుకున్న బయోమెట్రిక్ విధానం అమలు చేయడం లేదు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయడం లేదు, అలాగే ఎలక్ట్రానిక్ కాటు కూడా ఉపయోగించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన 1500 ఇంతవరకు గ్రామంలో ఒక్కరికి కూడా అందలేదు. బయోమెట్రిక్ విధానం అమలు లేకపోవడం వల్లే , నిత్యావసర సరుకులు ఆన్లైన్ విధానంలో ఇవ్వకపోవడం వల్లే 1500 రూపాయలు అందలేదని, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల గ్రామ ప్రజలు పూటగడవని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలు కూడా అందలేదని ఇకనైనా అధికారులు చొరవ చూపి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్