ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవనపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ సోడెరాంబాబు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ చేతుల మీదుగా..ఉత్తమ పురస్కారం అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక రెండవ విడత పల్లె ప్రగతిలొ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచ్ రాంబాబుకు ఉత్తమ సేవలు అందించారు. అవార్డు అందుకున్నందుకు గాను గ్రామ ఉపసర్పంచ్ కర్రీ మోహన్ రావు, చెలికాని నీలాద్రి బాబు, నాగ కృష్ణ, కిష్టం శెట్టి కృష్ణ, బాలద, సాంబశివరావు, ఎల్లంకి ప్రసాదు, గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.