కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిత్యావసర సరుకుల పంపిణీ

1145చూసినవారు
కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిత్యావసర సరుకుల పంపిణీ
శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో దళితవాడలో కృపా చారిటబుల్ ట్రస్ట్ మర్లపాడు వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసినారు. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు కుటుంబాల వారు ఇల్లు పడిపోయి నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న ట్రస్టు నిర్వాహకులు ఎబినేజర్ సుజాత దంపతులు బాధితులకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎబినేజరు మాట్లాడుతూ కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు వృద్ధులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. నిర్వాసితులైన కొరకొప్పుల సుశీల మరియు మేకల సాయిత్రమ్మ సహాయం చేసిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేకలు ధర్మారావు గ్రామస్తులు బూరుగు సురేష్ పాస్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :