కల్లూరు: సమస్యల పరిష్కారానికే కులగణన సర్వే

82చూసినవారు
కులగణన సమగ్ర సర్వే ద్వారా ఏయే సమస్యలున్నాయో తెలుకుని వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. సోమవారం కల్లూరు మండలం లింగాలలో జరుగుతున్న కులగణన సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజలు సామాజిక, ఆర్థిక, కుల అంశాలపై జరుగుతున్న సర్వేలో భాగస్వాములు కావాలని అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్