సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పెనుబల్లి ఎంపీఓ, గ్రామ పంచాయతీల కార్యదర్శిలతో ఎమ్మెల్యే మట్టా రాగమయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు దరఖాస్తు చేసుకునే వివిద సర్టిఫికెట్లను త్వరగా అందించే విధంగా కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కల నర్సరీలను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అటు గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పేర్కొన్నారు.