సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో నీలాద్రికొండ, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికార నామ సంవత్సర మాఘబహుళ చతుర్దశి ఫిబ్రవరి 21న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవములు శాస్త్రోక్తముగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాత సేవ తీర్థ పుబిందె, మంగళాశాసనం, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం అభిషేకములు అర్చనలు చేయనున్నారు. తీర్థ ప్రసాద వినియోగం ఉదయం 7 గంటల నుండి ప్రత్యేక దర్శనం జరుగుతుంది. శుక్రవారం రాత్రి 12 గంటలకు శ్రీస్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం 12 గంటల 30 నిమిషాల నుండి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశిరుద్రాభిషేకం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఉత్సవ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరని ఆలయ మేనేజర్ పి.వి.రమణ ఈ సందర్బంగా కోరారు.