ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామంలో బూరుగు గూడెం నుంచి నీలాద్రి గుడికి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు చాలా అధ్వానంగా తయారయింది. చాలామంది వాహనదారులు రోడ్డు మీద నీళ్లు నిలిచి ఉండటంతో రోడ్డు మీద నుండి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిన గ్రామ ప్రజలు కోరుతున్నారు.