కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు మద్దతు ధరను ప్రకటిస్తూ క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్యే మట్టా రాగమయి చెప్పారు. సోమవారం పెనుబల్లి మండలం లంకపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు.